శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో సీనియర్ నాయకుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.