గ్రేట‌ర్‌లో తెరాస అధికారంలోకి వ‌స్తేనే అభివృద్ధి: పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

హ‌ఫీజ్‌పేట‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో ప్ర‌జ‌లు ఆలోచించి ఓటువేయాలని జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్ అన్నారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని స‌త్య‌భార‌తి ఫంక్షన్ హాల్ లో డివిజన్ మహిళలతో టీఆర్ఎస్ అభ్యర్థి వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి, నాగేందర్ గౌడ్ లు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని అన్నారు. తెరాస అభ్య‌ర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల తెరాస అభ్య‌ర్థులు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు మాట్లాడుతూ తెరాస‌తోనే అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస అధికారంలోకి వ‌స్తేనే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, అన్ని డివిజ‌న్లు అభివృద్ధి చెందుతాయ‌ని అన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న పూజిత గౌడ్
పాల్గొన్న మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here