నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ హుడా కాలనీ చర్చ్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వనజ కోవిడ్ హాస్పిటల్ను శుక్రవారం ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్టిపిడుస్తున్న ఈ సమయంలో లో ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ను ప్రారంభించి, వైద్య సేవాలు అందించడం అభినందనీమని అన్నారు. ప్రజలు ఎవరు అధైర్య పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్ నిర్వకులు కేఎల్ మూర్తి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ లో కోవిడ్ విభాగం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ కు సంబందించిన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో వున్నాయని తెలిపార. నిరభ్యంతరంగా తమ హాస్పిటల్ కు వచ్చి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ కార్పోరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్, వ్యాపార వేత్త ప్రసాద్, న్యాయవాది కేతిరెడ్డి రామ్ బాబు, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వనజ, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.