నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్‌లు పాల్గొన్నారు. ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలలాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.