శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 7 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్‌పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.50,05,800 ఆర్థిక సహాయాన్ని 50 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరం అని అన్నారు. ప్రతి పేద కుటుంబం ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతుందని తెలిపారు. వారి కోసం ఇంకా ఎలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతుండడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, మారేళ్ల శ్రీనివాస్, పురేందర్ రెడ్డి, కావూరి అనిల్, ఎల్లం నాయుడు , పోశెట్టి గౌడ్ , శ్రీనివాస్ రెడ్డి, శ్రావణి రెడ్డి లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.