విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి: ప‌ల్లె మురళి

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి చూపించింద‌ని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లె మురళి అన్నారు. రూ.3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించింది కేవలం రూ.26,674 కోట్లే అని, 2026-27 ఆర్ధిక సంఘం కేటాయింపులలో విద్యారంగానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు 8.22% మాత్రమేన‌ని అన్నారు. 2025-26 ఆర్ధిక సంఘంలో 7.6% కేటాయించిగా ఈ సారి ఆ కేటాయింపులు 8.22% మాత్రమేన‌ని, ఈ రెండు బడ్జెట్లలో వ్యత్యాసం కేవలం 0.6% మాత్రమే అని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న ప్రసంగాల్లో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని తేటతెల్లం అవుతుందని అన్నారు.

ఈ పద్దులలో కేటాయించిన కేటాయింపుల్లో 80% పై గా కేవలం జీతాలకే సరిపోతుంద‌ని, వారు అంటున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలే కానీ విద్యామిషన్ నివేదిక అంటున్న తెలంగాణ పబ్లిక్ పాఠశాలలే కానీ ఎలా ఏర్పాటు చేస్తారని ప్ర‌శ్నించారు. ఇబ్బడి ముబ్బడిగా విద్యార్ధుల స్కాలర్షిప్ లే పెండింగ్‌లో ఉన్న పరిస్థితి తెలిసిందే. విద్యార్ధులు సర్టిఫికెట్ లు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మౌలిక సదుపాయాలు లేక ప్రాథమిక పాఠశాలల‌ నుండి యూనివర్సిటీల వరకు విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో బడ్జెట్లో విద్యకు నామమాత్ర కేటాయింపులు చేయడం, విద్యావ్యవస్థను సమూలంగా అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి పెదవుల్లో తప్ప ఆచరణలో విద్యార్ధులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నద‌ని తేటతెల్లం అవుతుంద‌ని అన్నారు. కావున ఈ బడ్జెట్ ను AIFDS రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here