శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ కో అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆయన సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ HMT శాతవాహన నగర్ కాలనీ కో అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. కాలనీ అభివృద్ధికి అసోసియేషన్ నాయకులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో HMT శాతవాహన నగర్ కాలనీ కో అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు చీఫ్ ప్యాటర్న్ రామకోటేశ్వరరావు, మెంబర్లు బాబు రావు, యాదిరెడ్డి, రాజు, హన్మంత రావు తదితరులు పాల్గొన్నారు.