హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద‌ల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలోని సెయింట్ ఐజాక్ అద్వెంట్ హై స్కూల్‌లో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద‌ల‌కు నిత్యావసర సరుకుల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాదాపూర్‌ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా 200 నిరుపేద కుటుంబాలకు నిత్యావ‌స‌ర స‌రుకుల కిట్ల‌ను అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేదలకు బాసటగా నిలిచేలా హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఇలాంటి సామాజిక సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రెటరీ సునీల్, స్కూల్ డైరెక్టర్ హైజక్ లాజరిస్, స్కూల్ ప్రిన్సిపాల్ కమర్ జహన్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు, బాలరాజు, వార్డు సభ్యులు రహీం, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు కాసిం, బి బ్లాక్ అధ్యక్షుడు శంకర్ రావు, సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, నాయకులు రహ్మాన్, లియాకత్, మునాఫ్ ఖాన్, నర్సింగ్ రావు, సత్యనారాయణ గుప్త, రాములు యాదవ్, బాబు, రామకృష్ణ, అంకా రావు, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షుడు ఖాజా, హజి, మహిళలు శశిరేఖ, శ్రిజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులను అందజేస్తున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ప్ర‌తినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here