నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్, శాంతి నగర్, పీఏ నగర్ కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఆయా కాలనీలలో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆదర్శ నగర్ కాలనీలో అంతర్గత రోడ్లు సరిగా లేవని రోడ్లను నిర్మించాలని కాలనీ వాసులు కోరారు. త్వరలోనే రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చెప్పారు. కాలనీ వాసులు హరితహరంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, అధికారులు ఏఈ అనురాగ్, వాటర్ వర్క్స్ మేనేజర్ సునిత, ఎస్ ఆర్ పీ వినయ్, టిఆర్ఎస్ నాయకులు ఓ.వేంకటేష్, నాగరాజు, గుడ్ల ధనలక్ష్మి, అక్బర్ ఖాన్, దాస్, జేవి.రావు, రాజుకృష్ణయ్య, సీతారాం రెడ్డి, శ్రీనివాస్, రాంచందర్, బిక్షపతి, దాసరి గోపి, సందింప్ రెడ్డి, వరలక్ష్మి , పార్వతి , కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.