ఘనంగా వాలా హరీష్ జన్మదిన వేడుకలు – ఎమ్మెల్యే ‌గాంధీ, కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటిన హరీష్ రావు

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్, హఫీజ్ పేట్ కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ల‌ అధ్యక్షులు రాజు యాదవ్, రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. వాలా హరీష్ రావును శాలువాతో సన్మానించి జన్మదిన కేకును కట్ చేయించారు.

వాలా‌ హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ఇలాంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లతో కలిసి వాలా హరీష్ రావు మొక్కలను‌ నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణయ్య, కార్తిక్ గౌడ్, పద్మారావు, నరేందర్ బల్ల, రాజశేఖర్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి , ఉమామహేశ్వర, విష్ణు, సురేష్, సురేందర్, ప్రసాద్, నాగేశ్వరరావు, వీరభద్రరావు, సుబ్రమణ్యం, కృష్ణ రావు, హాఫీజ్ పెట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంది జ్ఞానేశ్వర్, విజయ్, లక్ష్మణ్, బాలకృష్ణ, రాజా రెడ్డి ఆయా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

జన్మదినం‌ సందర్భంగా కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ ‌గౌడ్ తో‌‌ కలిసి మొక్కలు నాటుతున్న వాలా‌ హరీష్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here