నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని మారుతీ నగర్, రాజేందర్‌రెడ్డి నగర్‌లలో చెత్త సేకరిస్తున్న ఆటో కార్మికులు నాగరాజు, నారాయణ స్వామిలు ఇటీవల కరోనా సోకి ఇటీవల మృతి చెందారు. కాగా వారి కటుంబాలకు జీహెచ్ఎంసీ నుంచి ఆర్ధిక సహాయం అందేలా చూడాలంటూ జీహెచ్ఎంసీ చెత్త ఆటోకార్మిక సంఘం నాయకులు మంగళవారం చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి వినతీపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మృతల కుటుంబాలకు తగిన పారితోషకం అందేలా చూస్తానని, వారి కుటుంబంలో ఒకరికి ఆ ఉద్యోగం వచ్చేలా చూస్తానని బరోసా కల్పించారు. అదేవిధంగా మృతి చెందిన కార్మికుల పిల్లలకు చదువుకు అవసరమైన ఖర్చును సొంతంగా భరిస్తానని హామీ ఇచ్చారు. కరోనా ప్రారంభమైన నాటినుండి మొదటి వరుసలో ఉండి సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు కరోనా కాటుకు బలవ్వడం బాదాకరమని, ఈ క్రమంలో వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఇంక ముందుకురావడం లేరని, అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలని సూచించారు.
