హఫీజ్ పేట్ యూపీహెచ్ సీ లో ఎయిడ్స్ పై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: ఎయిడ్స్ వ్యాధి పట్ల జాగ్రత్తలు వహించి వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హఫీజ్ పేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ డి.‌వినయ్ బాబు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకుని హఫీజ్ పేట్ యూపీహెచ్ సీ లో ఎయిడ్స్ పై అవగాహన‌ కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి అని ఈ వ్యాధిత సోకిన వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన‌ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఓ రమేష్ నాయక్, పండరి రెడ్డి, సూపర్ వైజర్ సునీత, సిబ్బంది రజిత, కవిత, రిటైర్డ్ డీపీఎంఓ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ యూపీహెచ్ సీ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here