నార్నే సంస్థ రౌడిలను పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తుంది – సెంట్రల్ పార్క్ ఫేజ్-2 వాసుల ఆవేదన

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లోని సెంట్రల్ పార్కు ఫేజ్ 2 ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుండగా‌ నార్నే సంస్థకు చెందిన‌ వ్యక్తులు కొందరు‌‌ రౌడీలతో అభివృద్ధి పనులను, దైవ కార్యాలను అడ్డుకుంటూ స్థలాలను కబ్జా చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సెంట్రల్ పార్కు ఫేజ్ 2 కాలనీ వాసులు వాపోతున్నారు. నార్నె సంస్థ 1995 వ సంవత్సరంలో సెంట్రల్ పార్క్ ఫేజ్ -II లే ఔట్ అభివృద్ధి చేసి 2015 సంవత్సరంలో హెచ్ఎండీఏ అప్రూవర్ లో సుమారు 350 ప్లాట్లలను ప్రజలకు విక్రయించారన్నారు. హెచ్ఎండీఏ లే ఔట్ లో 3 పార్క్ లు , ఎమినిటీస్ స్థలం, రోడ్లు జీహెచ్ఎంసీ కి గిఫ్ట్ గా ఇచ్చారన్నారు. సభ్యుల వినియోగార్థం వీటన్నింటిని అభివృద్ధి చేసి ఇచ్చారన్నారు. ఇందులో సుమారు 200 మంది సభ్యులు ఒక సంస్థగా ఏర్పడి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. సదరు సభ్యులందరూ ఎమినిటీస్ స్థలంలో కాలనీ వాసుల, ప్రజావసరాల దృష్ట్యా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నవంబర్ 21 వ తేదీన ఆలయ నిర్మాణానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ‌సురభి వాణీ దేవి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా శంకుస్థాపన సైతం చేయడం జరిగిందన్నారు. ఎమినిటీస్ స్థలంలో ఆభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించగా నార్నె సంస్థ వారు రౌడీల సహాయంతో పూజలను అడ్డుకుంటూ కాలనీ సభ్యులందరిని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. కాలనీలో చేపడుతున్న యూజీడీ లైన్లను వేయకుండా ఇదివరకు అడ్డుకున్నారని, పార్క్ స్థలాలను కబ్జా చేసి కాలనీ వాసులందరిని కష్ట నష్టాలకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని దేవస్థానం ప్రాంగణం స్థలాన్ని రక్షించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here