నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకవైపు నిరుపేదలకు సరైన ప్రభుత వైద్యం అందక, మరోవైపు కార్పొరేట్ హాస్పిటల్స్ ధనదాహానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని హ్యూమన్‌రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గున్నాల అనిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు కరోనా రోగులకు ఎలాంటి వైద్యం అందించాలనే విషయంలో సరైన స్పష్టత లేదని, కోవిడ్ వైద్యంలో అందిస్తున్న రెమిడిసివర్ లాంటి మందులను సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించడం ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నారు. ఇలాంటి దిక్కుతోచని సమయంలో నెల్లూరు వేధికగా అనందయ్య అనే మూలికా వైద్యుడు రూపొందించిన ఆయుర్వేద మందు కోవిడ్ రోగులలో ఎంతో ఉపశమనం కలిగించడం ఆశాజనకమైన విషయమని అన్నారు. ఆనందయ్య ఆయూర్వేద మందు పట్ల ఆయుష్ మంత్రాలయం ఏకంగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కమిటిని సిఫారసు చేయడమంటే భారతీయ పురాతన వైద్యానికి మరోసారి తగిన గుర్తింపు లభించడమే అన్నారు.
ఈ క్రమంలో ఐసీఎంఆర్ ద్వారా త్వరగా నివేదికను స్వీకరించి ఆనందయ్య ఆయూర్వేద మందు ప్రజలందరికి చేరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. కరోనా రోగుల నుంచి ఒకవైపు కార్పొరేట్ దవఖానాలు లక్షల రూపాయలు దండుకుంటుంటే నెల్లూరు ఆనందయ్య ఉచితంగా ములికా వైద్యం అందించడం అభినందనీయమని, ఈ వైద్యం దేశ ప్రజలందరికి అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే హాస్పిటల్స్‌ను వీడి ఆనందయ్య వైద్యం వైపు రోగులు పరుగుల తీస్తున్న నేపథ్యంలో మెడికల్ మాఫియా ఆ వైద్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారి కుట్రలకు అడ్డుకట్ట వేసి ఆనందయ్య మందు నిరుపేదలందరికి అందేలా తగిన ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఆనందయ్య ఆయూర్వేద మందును ప్రోత్సహించడం వల్ల జరిగే నష్టం ఎం లేదని, పైగా నిరుపేద రోగుల్లో బరోసా నింపిన వారవుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.
