కొండాపూర్ జిల్లా ద‌వాఖానా సూప‌రెంటెండెంట్ డా.ద‌శ‌ర‌థ్‌తో గాంధీ స‌మీక్ష‌… కోవిడ్ రోగుల సేవ‌ల‌పై ఆరా…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ఏరియా హాస్పిట‌ల్ సూప‌రెంటెండెంట్ డాక్టర్ దశరథ్‌తో ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ శుక్ర‌వారం వారి నివాసంలో ప్ర‌త్యేక సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న అనంత‌రం హాస్పిట‌ల్‌లో కోవిడ్ రోగుల చికిత్స‌పై ఆరాతీశారు. కాగా ప్రస్తుతం కరోనా చికిత్స కొరకు 110 పడుకలు అందుబాటులో ఉండగా, అందులో 40 మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని, ఇంకా 70 పడుకలు ఖాళీగా ఉన్నాయ‌ని, అదేవిధంగా 108 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నావని సూప‌రెంటెంటెండెంట్ ప్ర‌భుత్వ విప్‌కు తెలియ‌జేశారు. మంత్రి గారి పర్యటనలో కలెక్టర్ ఆదేశాలతో 40 సిలిండర్లు అదనంగా ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ నిల్వల కొరత తీరిందని తెలియజేసారు. స్వచంద సంస్థల ద్వారా నిధుల సమీకరణలో సహకరించిన ప్రభుత్వ విప్ గాంధీకి ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కరోనా చికిత్సకుగాను ప్రత్యేకంగా తొమిది మంది డాక్టర్లు నిత్యం రొటీన్ పద్దతిలో టర్మ్ డ్యూటీ ద్వారా నిరంతరం రోగులకు సేవలందిస్తున్నారని, 4 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ క‌రోనా రోగుల‌ చికిత్సకు సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గర్భిణీ స్త్రీలు, పిల్లలు చికిత్సకు సంబంధించిన సేవలను, మరియు ఆసుపత్రి లో రోజువారీ అవుట్ పేషంట్ సేవలను యధావిధిగా కొనసాగించాలని సూచించారు. రాజకీయనాయకులు కొందరు ఆసుపత్రి ప్రాంగణంను సందర్శించిన విషయాన్ని సుపరిడెంట్ ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకురాగా, ఆసుపత్రిలో రాజకీయాలు చేయడం బాధాకరమని, జిల్లా ఆసుపత్రిలో సేవలు పేదవారి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన వసతులు కార్పొరేట్ ఆసుపత్రి కి ధీటుగా ఉన్నాయ‌ని అన్నారు. అనవసర రాజకీయాలను ప్రోత్సహించకూడదని, కరోనా రోగులువున్న ఆసుపత్రి లో ఇతరులు ప్రవేశించడం ఎంతోప్రమాదమని తెలియజేసారు. ఆసుపత్రిలో సేవలను సహాయం అందించేవారికి సహకరించాలని రాజకీయాలు చేసే వారిని అనుమతించడం సమంజసం కాదని తెలియచేసారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీతో స‌మావేశమైన కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్ సూప‌రెంటెండెంట్ డాక్ట‌ర్ ద‌శ‌ర‌థ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here