హఫీజ్ పేట్ డివిజన్ లో రూ.3.53 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రూ. 3.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి ‌గాంధీ స్థానిక‌ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ డివిజన్‌ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని, ప్రజలకు అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు.  ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు, మైత్రి నగర్ ఫేజ్ -3 లో రూ.30 లక్షలతో యు.జీ.డి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ పేర్కొన్నారు. సాయి రామ్ కాలనీ లో రూ.10 లక్షలతో యూజీడీ నిర్మాణ పనులు, జువెల్ గార్డెన్ అపార్ట్ మెంట్స్ నుండి జనప్రియా ఫేస్-1 కమాన్ వరకు రూ.9.80 లక్షలతో యూజీడీ నిర్మాణ పనులు, బచ్చుకుంటా చెరువు (ఆర్.టి.సి కాలనీ) నుండి ఎన్.హెచ్.9 మెయిన్ రోడ్డు వరకు రూ.63 లక్షలతో ఎస్ డబ్ల్యుడి నిర్మాణ పనులు, జనప్రియా 10 ఎ/బి నుండి సితార గ్రాండ్ హోటల్ వరకు రూ. కోటి 75 లక్షలతో ఆర్ సీ సీ నిర్మాణ పనులు, వైశాలి నగర్ లో రూ.25 లక్షలతో ఆర్.సీ.సీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు‌ వివరించారు. ఆదిత్య ఇంపీరియల్ అపార్ట్‌మెంట్ నుండి ప్రకాష్ నగర్ చెరువు వరకు రూ.34.50 లక్షలతో ఆర్.సీ.సీ నిర్మాణ పనులు‌ జరుగుతాయని చెప్పారు. హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ , గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ డిప్యూటీ మేయర్ కు స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ ప్రజల తరపున ప్రత్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈ.ఈ శ్రీకాంతి, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బల్లింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, వార్డ్ సభ్యులు కనకమామిడి‌ వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రవి కుమార్, నాయకులు శాంతయ్య, రామకృష్ణ గౌడ్, లక్ష్మా రెడ్డి,‌ వీరేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉమామహేశ్వర్ రావు, యాదగిరి ముదిరాజ్, సుధాకర్, నాయుడు, శేఖర్ రెడ్డి, జ్ఞానేశ్వర్, దయానంద్ రెడ్డి,‌ పూర్ణచంద్రావు, జనార్ధన్ గౌడ్, ప్రవీణ్, పద్మ రావు, శంకర్, మల్లేష్, ప్రసాద్, ఏఈ ధీరజ్,‌ శానిటేషన్ ఎస్ఆర్ పి మహేష్,‌ మహిళలు మీనాక్షి, శ్రీదేవి, పద్మ, సరళ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో పలు‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here