నమస్తే శేరిలింగంపల్లి: కార్యకర్తలను కంటికి రెప్పలా టీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుదని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వారికి పదవులు ఖాయమని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాం, సుభాష్ చంద్రబోస్ నగర్, జనప్రియ నగర్-||, జనప్రియ 4ఏ/బి,10ఏ/బి నూతన బస్తీ, మహిళ, యూత్, మైనారిటీ, ఎస్సీ కమిటీలను స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, లక్ష్మా రెడ్డి తో కలిసి వేశారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ పటిష్టతకు పాటు పడాలని పూజితజగదీశ్వర్ గౌడ్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సలహాల మేరకు టీఆర్ఎస్ బస్తీ కమిటీలను వేయడం జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షునిగా దేవరాజ్, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా భీమమ్మ, యూత్ కమిటీ అధ్యక్షునిగా రోహిత్ కుమార్, మైనారిటీ కమిటీ అధ్యక్షునిగా ఇస్మాయిల్ ఖాన్, ఎస్సీ కమిటీ అధ్యక్షునిగా అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. జనప్రియ నగర్-|| బస్తి కమిటీ అధ్యక్షునిగా ఎం.అశోక్, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్. లక్ష్మి దేవి, జనప్రియ అపార్ట్మెంట్ 4ఏ/బి,10ఏ/బి బస్తి కమిటీ అధ్యక్షునిగా శివ ప్రసాద్, మహిళ కమిటీ అధ్యక్షురాలిగా శాంతిని నియమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, జ్ఞానేశ్వర్, భగత్ తదితరులు పాల్గొన్నారు.