శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ టౌన్‌ప్లానింగ్ డీసీపీగా కేఎన్ మెహ్ర – జోన‌ల్ ఏసీపీగా సురేంద‌ర్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంప‌ల్లి జోన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అన్ని జోన్‌ల‌కు సంబంధించి ప‌లువురు టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు స్థానచ‌ల‌నాలు క‌ల్పిస్తూ చీఫ్ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ డిప్యూటీ సిటీ ప్లాన‌ర్‌గా కేఎన్ మెహ్రా నియ‌మితుల‌య్యారు. కాగా ప్ర‌స్థుతం ఇక్క‌డ ఏసీపీగా విధులు నిర్వ‌హిస్తున్న గంగిడి స్వ‌ప్నా రెడ్డి బ‌ల్దియా ప్ర‌ధాన కార్యాల‌యానికి బ‌దిలీపై వెళ్లారు. అదేవిధంగా శేరిలింగంప‌ల్లి జోన్ ఏసీపీగా విధులు నిర్వ‌హిస్తున్న ఏకే రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ‌తో ఆ స్థానం ఖాలీ ఉండ‌గా ఉప్ప‌ల్ స‌ర్కిల్ 2లో ఏసీపీగా విధులు నిర్వ‌హిస్తున్న ఈ.సురెంద‌ర్ రెడ్డి బ‌దిలీపై ఇక్క‌డికి రానున్నారు. ఐతే అటు మెహ్ర, ఇటు సురెంద‌ర్ రెడ్డిలు గ‌తంలో చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌లో విధులు నిర్వ‌హించ‌న వారు అవ్వ‌డం విశేషం.

రిలింగంప‌ల్లి స‌ర్కిల్ డిప్యూటీ సిటీ ప్లాన‌ర్‌గా కేఎన్ మెహ్రా

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here