నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరుస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని నిరూపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. తెలంగాణ మైనార్టీ గురుకులం శేరిలింగంపల్లి బాలుర 1 విద్యాసంస్థలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2022 ఫలితాలలో అత్యధిక జీపీఏ, మార్క్ లు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పథకాలను, ఇంగ్లీష్ నిఘంటువులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెలంగాణ మైనారిటీ గురుకుల శేరిలింగంపల్లి బాలుర 1 పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ చందర్ రెడ్డి, బోధన,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.