నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబర్ 6 వైపు రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానిక జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికుడు కడమంచి సురేష్ 108కు ఫోన్ చేశాడు. కాగా అంబులెన్స్ సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందిందని దృవీకరించారు. దీంతో పోలీసులకు సమాచరం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళకు 70 ఏళ్ల వయస్సు ఉండవచ్చని, కొంత కాలంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తుందని గుర్తించారి. అనారోగ్యం కారణంగ మృతిచెంది ఉంటుందని పోలిసులు బావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఫోన్ నెంబర్ 9490617118, 8332981141లలో చందానగర్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.
