మియపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని మియాపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేపట్టారన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే అన్ని డివిజన్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారన్నారు. తెరాస అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలన్నారు.


మియాపూర్ డివిజన్‌లో ర్యాలీ…
మియాపూర్ డివిజన్ పరిధిలో తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్‌కు మద్దతుగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలా దేవి, కోడలు డాక్టర్ భార్గవిలు శ్రీకాంత్‌తో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెరాసకు ఓటు వేయాలని కోరారు. ఉప్పలపాటి శ్రీకాంత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
