చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): నిస్వార్థంగా రాష్ట్ర ప్రజలకు సేవలందించింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలకు పార్టీ పట్ల అమితమైన విశ్వసం ఉందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం చందానగర్ డివిజన్ అభ్యర్థి అక్సారిబేగం కు మద్దతుగా అయన పెరిగి మాజీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని, టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకున్నంత అభివృద్ధి క్షేత్ర స్టేయిలో కానరావడం లేదన్నారు.

టిఆర్ఎస్ నాయకులు గత ఏడేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగాలు లభించక, ప్రజలు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. టిఆర్ఎస్ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
