స్మశాన వాటిక స్థలాన్ని కాపాడుకోవాలి: ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక సాధన కమిటీ

నమస్తే శేరిలింగంపల్లి: ఖానామెట్ ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం టీఐసీసీ ద్వారా వేలం పాట వేసి విక్రయించాలని చూడడం సరికాదని ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 1995 సంవత్సరం నుంచి సర్వే నెంబర్ 41 /14 లో ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక కొనసాగుతుందని, చుట్టుపక్కల వారు మృతిచెందితే దహన సంస్కారాలు ఈ స్మశాన వాటికలోనే జరుపుతున్నారని అన్నారు. కొన్ని రోజుల క్రితం నుంచి ప్రభుత్వం వేలం పాట వేసి అమ్మాలని చూడడం సరికాదన్నారు. విద్యుత్ నగర్ స్మశాన వాటిక స్థలం మూడు ఎకరాలను 17 నెంబర్ ప్లాట్ గా క్రియేట్ చేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిపై హై కోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చామని చెప్పారు. ప్రభుత్వం తరపున నెల రోజుల గడువు అడిగి ఇప్పటి వరకు కోర్టులో అప్పీల్ సబ్మిట్ చేయలేదన్నారు. ఈ మధ్య కాలంలో స్మశానవాటికకు అనుకుని ఉన్న యశోద హాస్పిటల్ యాజమాన్యం స్మశాన స్థలాన్ని కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారని అన్నారు. విద్యుత్ అధికారులు మట్టిని తవ్వి బొందల మీద వేస్తున్నారని పేర్కొన్నారు. స్మశాన వాటిక స్థలాన్ని కాపాడుకునేందుకు బస్తీవాసులు ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయాల ముందు నిర్వహించనున్న ధర్నాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు రామకృష్ణ, కాలనీవాసులు మాల చక్రవర్తి, జెట్టి హుసేన్, నర్సింగ్ నాయక్, కె చందు యాదవ్, ఎస్. కుమార్, ఎస్. నారాయణ, ఆలకుంట చందు, శివకుమార్, బాలు నాయక్, సంగ మాల కొండల్, ఎం‌. వెంకటేష్, ఎస్. కేశవులు, ఏఐటీయూసీ కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు‌.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here