నమస్తే,శేరిలింగంపల్లి: చందానగర్ విశాఖ శ్రీ శారద పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో షడ్వింశ బ్రహ్మోత్సవాలు నాల్గో రోజున అంగరంగవైభవంగా జరిగాయి. శనివారం ఉదయం 7.30 గంటలకు నిత్యోపాసనం, 8.30 గంటల నుంచి 9. 30 వరకు ఉత్సవాస్తస్నపనం నిర్వహించారు. 10 నుంచి 11. 30 వరకు దుష్టగ్రహ నివారణార్థం శ్రీ మహా సుదర్శన హోమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు నిత్యోపాసన, రాత్రి 7. 30 నుండి 8. 30 వరకు సహస్ర దీపాలంకరణ సేవ, గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వాముల దివ్య ఆశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యులు సమక్షంలో పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
సుదర్శనం సత్యసాయి ఆచార్యులకు జన్మదిన శుభాకాంక్షలు
చందానగర్ వేంకటేశ్వరాలయ సముదాయం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పీఠాధిపతుల దివ్యాశీస్సులతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ సుదర్శనం సూర్య పురుషోత్తమ సత్యసాయి ఆచార్యుల జన్మదినం సందర్భంగా వేంకటేశ్వరస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవకులు, భక్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.