నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు రాళ్లను, మట్టిని డబ్బింగ్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు గంగల రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారుమ ఈ మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సీఐని బీజేపీ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఇజ్జత్ నగర్ స్మశాన వాటిక పై కోర్టు స్టే ఉండగా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భవన నిర్మాణాల వేస్టేజ్ ను, మట్టిని, రాళ్లను వేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాధాకృష్ణ అన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి టి రామకృష్ణ, కె. వెంకట స్వామి, కె. చందు యాదవ్, సంఘం చక్రవర్తి, కురుమూర్తి తదితరులు ఉన్నారు.