నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ అసోసియేషన్ నూతనంగా కార్యవర్గ సభ్యులు మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మయూరి నగర్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు నారాయణ రావు, ఉపాధ్యక్షలు వెంకట రామిరెడ్డి, ఉపాధ్యక్షులు లావణ్య, జనరల్ సెక్రటరీ రామరాజు, జాయింట్ సెక్రటరీ ఎంవీ రంగారావు, జాయింట్ సెక్రటరీ కృష్ణ కుమార్, ట్రెజరర్ నర్సింహ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుబ్బరాజు, నాగ శేషాయ్య, ఫణి కృష్ణ, మధుసూదన్ రావు, పాండ్య, నర్సింహం , శ్రీనివాస రావు, నళిని మోహన్ రావు, గోపాల్ రెడ్డి, అనూష, హారి, వికాస్ కాలనీ వాసులు చంద్రికప్రసాద్ గౌడ్, అశోక్, రంగరాజు, సుబ్రమణ్యం, శంకర్ రావు, సోమేశ్వర్ రెడ్డి, రమేష్, బేబీ, స్వాతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.