ఘనంగా యాదవుల కార్తీక మాస వన భోజనాలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వనస్థలిపురం జింకల పార్కులో నక్క ఉమేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, వివాహ పరిచయ కార్యక్రమానికి యాదవ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యాదవులు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు బి.అనంతయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నక్క ఉమేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కార్తీక మాస వనభోజనాల‌ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ తల్లిదండ్రులు నక్క యాదగిరి స్వామి యాదవ్, నక్క వెంకటమ్మ యాదవ్ పేరు మీద ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత స్కూళ్లలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పలు పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం ప్రొజెక్టర్లు అందజేస్తున్నామని నక్క ఉమేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ప్రస్తుతం బీసీ కులగణనలో యాదవులందరూ తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యాదవులు అన్ని పదవులకు పోటీ చేయాలని, యాదవులంతా ఐకమత్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులలో ఒక్క మంత్రి కూడా లేకపోవడం బాధాకరమైన విషయమన్నారు.రాజకీయంగా యాదవులు చాలా వెనుకబడి ఉన్నారని, కాబట్టి యాదవులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలని భేరి రామచందర్ యాదవ్ ప్రభుత్వాన్ని యాదవ సంఘం తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నక్క ఉమేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ కు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యావంతుల వేదిక సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, త్రినాధ్ యాదవ్, యాదవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here