పాప‌మ్మ కాల‌నీ అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పాపమ్మ కాలనీలో కాలనీ ముఖ ద్వారం ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ ముఖద్వారం కాలనీకి చిరునామాకు సంకేతంగా ఉపయోగపడుతుంద‌ని, కాలనీకి గుర్తుగా తోడ్పడుతుంద‌ని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంద‌ని, పాపమ్మ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, కాలనీ అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

పాప‌మ్మ కాల‌నీ ముఖ‌ద్వారాన్ని ప్రారంభిస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, జిల్లా గణేష్, మరేళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, నాగరాజు, ఖలీమ్, గణేషన్, కాలనీ వాసులు పాపమ్మ, రాంచందర్, వేలు, రాము, కృష్ణ, త్రినాథ్, వెంకటరావు, మాధవరావు, శ్రీను, కుమార్, నరేందర్, నందు, రామరాజు, జీవన్, రామకృష్ణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ‌ద్వారం వ‌ద్ద PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here