శేరిలింగంపల్లి, డిసెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): జిల్లా స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో త్రివేణి స్కూల్ మదీనాగూడ, త్రివేణి స్కూల్ లింగంపల్లి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తయారుచేసిన 12 ప్రాజెక్ట్స్ తో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ పోటీకి రంగారెడ్డి జిల్లా నుండి వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తమ తమ ప్రాజెక్టులతో పోటీ పడ్డారు. ఈ పోటీలో స్కూల్ మదీనాగూడ బ్రాంచ్ సీనియర్ విభాగంలో రెండు ప్రాజెక్టులకు జిల్లా మొదటి, రెండో బహుమతులు లభించాయి. అలాగే జూనియర్ విభాగంలో జిల్లా మొదటి, రెండో బహుమతులు లభించాయి.
సీనియర్ విభాగంలో రంగారెడ్డి జిల్లా మొదటి బహుమతిగా రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ అరికట్టే ప్రాజెక్ట్ కు గాను 9వ తరగతి చదువుతున్న కె.మనస్వనికి మొదటి బహుబతి రాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ విధానంపై ప్రాజెక్టుకు గాను ఎ.లక్ష్మీ సహస్ర రెండో బహుమతి సాధించింది. అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతులను మ్యాథమెటికల్ మోడలింగ్ లో క్యాలిక్యులేషన్స్ ఆఫ్ యాంగిల్స్ ప్రాజెక్టుకు 7వ తరగతి చదువుతున్న శశిధర్, లక్ష్మీ శాన్విక సొంతం చేసుకున్నారు. సీనియర్ విభాగంలో రిసోర్స్ మేనేజ్మెంట్ లో జిల్లా రెండో బహుమతిని ఫుడ్ స్టెప్ ఎనర్జీ ప్రాజెక్టుకు గాను 9వ తరగతి చదువుతున్న అన్విత కైవసం చేసుకోగా, 2వ బహుమతిని నాచురల్ ఫామింగ్ విభాగంలో 9వ తరగతి చదువుతున్న స్నేహిత రెడ్డి కైవసం చేసుకుంది. అలాగే జూనియర్ కేటగిరిలో జిల్లా రెండో బహుమతిని ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ లో – జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్ యాక్సిడెంట్లను నివారించడం అనే ప్రాజెక్టుకు గాను 8వ తరగతి చదువుతున్న సంజిత్, గోపాల్ చౌదరి కైవసం చేసుకున్నారు. 2వ బహుమతిని నాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు గాను 7వ తరగతి చదువుతున్న అనన్య ప్రధాన్ కైవస్ చేసుకున్నారు.
ఈ ప్రదర్శనలో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని, విద్యార్థులు స్టేట్ లెవెల్ లో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో కూడా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్స్ సిఆర్ఓ సాయి నరసింహారావు, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, జగదీష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.