- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని డివైన్ హోమ్స్ అపార్ట్‌మెంట్, శుభం ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ వాసులతో ఆదివారం కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావంతులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని అన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా ఓటును నమోదు చేసుకోవాలని, రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాసామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.