లింగంప‌ల్లి గ్రామంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ‌ నిధుల ద్వారా లింగంపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం లింగంపల్లి గ్రామంలో స్థానికులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి రాగం‌ నాగేందర్ యాదవ్ పర్యటించారు. లింగంపల్లి గ్రామంలో ఒకప్పుడు సమస్యలు విలయతాండవం‌ చేసేవని, ఎంతో మంది పాలకులు వచ్చినా గ్రామాభివృద్ధి జరగలేదన్నారు. రోడ్లు, మురికి‌ కాలువలతో అధ్వాన్నంగా నెలకొన్న సమస్యలను దాదాపు పూర్తి చేశామని, సీసీ రోడ్లు, యూజీడీ లైన్లు, ఇంటింటికి మంచినీటి పైపులైన్ పనులు వేయించడం జరిగిందన్నారు.

లింగంప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీల‌ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.‌ గ్రామ అభివృద్ధి కమిటీ విజ్ఞప్తి మేరకు గ్రామంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ నిధులు రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. కమ్యూనిటీ హాల్ తో పాటు గ్రామంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసేలా చూడాలని గ్రామ అభివృద్ధి కమిటీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వినతిపత్రం అందజేసింది. ‌బస్తీ దవఖానా ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు బాబురావు యాదవ్, నాగరాజు, సత్యనారాయణ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి ముదిరాజ్ తో పాటు దేవులపల్లి శ్రీనివాస్, కృష్ణ యాదవ్, మల్లికార్జున్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here