నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదోడిలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి సోమవారం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన గంగాధర్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు త్వరిత గతిన పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ బస్తీబాట కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నాయకులు కిషన్ సింగ్, మనిసిపల్ అధికారులు మరియు బస్తి వాసులు పాల్గొన్నారు.

వరదనీటి కాలువ పనుల పరిశీలన…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు సుమారుగా రూ. 1.40 కోట్ల అంచనావ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను స్థానికా కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. వర్షాకాలం సమీపీస్తున్న నేపథ్యంలో త్వరిత గతిన పనులు పూర్తిచేసి కాలువను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దని అన్నారు.
