నీట్, ఐఐటీలో సీట్లు సాధించిన గౌలిదొడ్డి గురుకుల పాఠశాల బాలికలు – అభినందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం‌ గురుకులాలకు పెద్ద పీట వేసిందని, గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి గురుకుల బాలికల పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు నీట్ ద్వారా 225 ఎంబీబీస్ సీట్లు, ఐఐటీ లో 25, నీట్ 14లో, టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల్లో‌ సీట్లు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి‌‌న‌ విద్యార్థులు, తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శారద, వైస్ ప్రిన్సిపాల్ వెంకట రమణ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను ఆరెకపూడి గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులుగా తీర్చిదిద్దడం సంతోషకరమని అన్నారు. ఎంబీబీస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శారద, వైస్ ప్రిన్సిపాల్ వెంకట రమణతో పాటు‌ ఉపాధ్యాయులను ఆరెకపూడి గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, దేశానికి, మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని,ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని, సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ పాఠశాల కమిటీ అధ్యక్షుడు స్వామి బాకీ, ఎర్ర యాకన్న, పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గౌలిదొడ్డి గురుకుల బాలికల పాఠశాల సిబ్బందిని అభినందిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here