నమస్తే శేరిలింగంపల్లి: గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో మహాగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు యుగతులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. గోసేవకులు, గోభక్తులు, గో స్వచ్ఛంద సంస్థలు, గోశాలల నిర్వాహకులు, గో సేవా సమాజాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగసభలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజియర్ స్వామీ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు. దేశంలోని సనాతన ధర్మ పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సాధుసంతులు పాల్గొనే ఈ భారీ బహిరంగసభలో గో బంధువులు లక్షలాధిగా పాల్గొని సభను విజయంతవం చేయాలని పిలుపునిచ్చారు.