నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నదని కిసాన్ యుక్తమోర్చ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు కిరణ్‌జీత్‌సింగ్ షేకాన్ పేర్కొన్నారు. భాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్‌లో వివిధ ప్రజాసంఘాలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలు రద్ధయ్యేంతవరకు ప్రజాసమీకరణతో పోరాటాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల, కార్మికుల హక్కులను కాలరాసే చట్టలను తెరపైకి తెస్తున్నదని, విద్యను కాషాయికరణ చేయడం, న్యాయవ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకుని, ప్రజల మధ్య మతద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు పూనుకుందని మండిపడ్డారు.
కార్పోరేట్ రంగానికి రెడ్‌కార్పెట్ పరుస్తూ రైతు జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేప్పాల్సిన అవసరం ఉందని, అది ప్రజాసమీకరణ పోరాటాలతోనే సాధ్యమని అన్నారు. ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐకేఎప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపు ఉపేందర్‌రెడ్డి, నాయకులు అనిల్‌కుమార్, గోనె కుమారస్వామి, సైదమ్మ, సుఖన్య, రాగసుధ, పల్లె మురళి, నాగార్జున, కాశీ, జబ్బర్‌నాయక్, పెద్దారపు రమేష్, సాంబయ్య, మట్టయ్య, వెంకన్న, నర్సయ్య, కొమురయ్య, బాబారావు, తుకారం, మల్లేష్, మధుసుదన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.