డివిజ‌న్‌లో పెండింగు ప‌నుల‌ను పూర్తి చేయండి… ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి భేటి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి బుద‌వారం చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఈఈ శ్రీకాంతి, డీఈ రూపాదేవిల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. డివిజన్ పరిధిలో పలు కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా కోనసాగుతున్నాయాని వాటిని వెంటనే పుర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంజులా ర‌ఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వర్షా కాలంలోపు డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా పలుకాలనిలలో మ్యాన్ హోల్స్ నుంచి మురుగు నీరు పోంగి రోడ్లపై ప్రవహిస్తుందని, అలాంటి చోట వెంట‌నే మరమ్మతులు చేపట్టాల‌ని, అవసరమైన చోట కోత్త మ్యాన్ హోల్స్‌ను ఏర్పాటు చేయాలి కోరారు. రానున్న‌ వర్షాకాలంలో వరదనీరు రోడ్ల పైకి చేరకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, డివిజ‌న్‌ ప్ర‌జ‌లు ఇబ్బందులు పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పున‌రుద్ధ‌రించాల‌ని సూచించారు. సానుకూలంగా స్పందించిన ఇంజ‌నీరింగ్ అధికారులు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఈఈ ప్ర‌శాంతి, డీఈ రూపాదేవిల‌కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న చందాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here