శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి బీసీ రేజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఫూలే భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటి మెంబర్ వి. జగదీశ్వర్ గౌడ్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లను కలిసి జగదీశ్వర్ గౌడ్ పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం జగదీశ్వర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి పాలన సాఫీగా సాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మలి విడత కులగణన కూడా వేగవంతం చేసి.. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రేజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పేరుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే కులగణన జరగడం గమనార్హమని తెలిపారు. తెలంగాణను అదర్శంగా తీస్కొని కేంద్రం సైతం కుల గణనపై ఆలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని బీసీలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.