ఆల్విన్ కాల‌నీ, హైద‌ర్‌న‌గ‌ర్‌ల‌లో ప్ర‌భుత్వ విప్ గాంధీ కుటుంబం ప్ర‌చారం

ఆల్విన్ కాల‌నీ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్ ప‌రిధిలో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌తో క‌లిసి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి, కోడలు డాక్టర్ భార్గవి, కుమారుడు పృథ్వి గాంధీలు శుక్ర‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు. కేవ‌లం తెరాసతోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. తెరాస అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు.

ఆల్విన్ కాల‌నీలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి, కోడలు డాక్టర్ భార్గవి, కుమారుడు పృథ్వి గాంధీ, చిత్రంలో దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌

హైద‌ర్‌న‌గ‌ర్‌లో…
హైద‌ర్‌న‌గ‌ర్‌లో డివిజ‌న్‌ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస్ తో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి, కోడలు డాక్టర్ భార్గవి, కుమారుడు పృథ్వీ గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పృథ్వీ గాంధీ ఓ టీ సెంట‌ర్‌లో టీ త‌యారు చేసి కార్య‌క‌ర్త‌ల‌కు అందించి ఆక‌ట్టుకున్నారు.

హైద‌ర్‌న‌గ‌ర్‌లో టీ స్టాల్‌లో టీ త‌యారు చేసి అందిస్తున్న పృథ్వి గాంధీ
హైద‌ర్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న శ్యామ‌లా దేవి, డాక్ట‌ర్ భార్గ‌వి, పృథ్వీ గాంధీ, నార్నె శ్రీ‌నివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here