శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ కి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సందీప్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భం గాంధీ ఆయనకు తెరాస కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తెరాసలో చేరే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకుడు నటరాజ్ పాల్గొన్నారు.
