- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమ న్యాయం అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని దీన బంధు కాలనీలో వర్షాల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితుల కోసం సీఎం కేసీఆర్ ఏకంగా రూ.550 కోట్ల ప్యాకేజీని మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రజలను ఆయన జాగ్రత్తగా చూసుకుంటారనేందుకు ఇది నిదర్శనమన్నారు. లబ్ధిదారులందరికీ సహాయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివ కుమార్, తెరాస నాయకులు ఎల్లంనాయుడు, మల్లేష్, స్థానికులు పాల్గొన్నారు.







