నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందించడమే ప్రభుత్వ ద్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్ బీ ఆధ్వర్యంలో రూ. 7.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్ వర్క్స్ బోర్డు నిధుల ద్వారా కాలనీ వాసుల కోరిక మేరకు కొత్త పైప్ లైన్ వేయటం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకాన్ని అర్హులైనవారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్ యాదయ్య, డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, సురేందర్, రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, మధు,నారాయణ, పరమేష్, శ్రీనివాస్, అంజమ్మ , పద్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.