నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కలిసి తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం బి. శ్రీను హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో ఫాస్ట్ ఫుడ్ చేసుకుంటూ భార్య బి. కౌసల్య, కూతుళ్లు బి. అనూష (14), బి.నాగవల్లి(13), కుమారుడు బి.అఖిల్ (11) ముగ్గురి పిల్లలతో జీవిస్తున్నాడు. గత నెల 25వ తేదీన భార్య బి. కౌసల్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారునితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అమ్మగారింటికి వెళ్లారనుకున్న భర్త శ్రీను అక్కడికి వెళ్లలేదని తెలుసుకుని చుట్టుపక్కల, బంధుమిత్రుల వద్ద ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. ఈ నెల 21 న భర్త శ్రీను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.