చెరువుల సుంధరీకరణ కోసం రూ. 4.92 కోట్లతో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు శంకుస్థాపనలు

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో‌ చెరువులను సుందరీకరణ చేసి పరిరక్షించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువుల‌ అభివృద్ధిలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద గల మెడికుంట కుంట చెరువు వద్ద కోటి 72 లక్షల 70 వేల రూపాయలతో, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు రూ.2.26 కోట్లు, చాకలి చెరువు రూ. 94 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీచెరువు, చాకలి చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువుల సుందరీకరణ లో భాగంగా చెరువు కట్టలను పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాలువ నిర్మాణం, అలుగు మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఫెన్సింగ్ వేసి చెరువులను పరిరక్షించుకోనున్నట్లు చెప్పారు. త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈలు పావని, మహేందర్, మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్, రాజేశ్వరీ, డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, రాజు యాదవ్, నాయకులు జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, సురేందర్, రాజు ముదిరాజు, రమేష్ గౌడ్, మధు,నారాయణ, పరమేష్, శ్రీనివాస్, అంజమ్మ, పద్మ, చింత కింది రవీందర్, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, రమేష్, వేణు గోపాల్ రెడ్డి, నటరాజ్, గోపాల్ యాదవ్, జమ్మయ్య, శ్రీకళ, ఫర్వీన్, రజిని, సౌజన్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ లో మేడికుంట చెరువు సుందరీకరణ కోసం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here