నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, గోపన్ పల్లి తండా లో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపన్ పల్లి, గోపన్ పల్లి తండా లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సమస్యలను కార్పొరేటర్ కు స్థానిక ప్రజలు వివరించారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి తాగునీరు, సిసి రోడ్లు, మురికి కాలువల పనులను త్వరితగతిన చేపట్టేలా చూడాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. బస్తీలో వెంటనే కొత్త భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ మంజూరు చేయాలనీ అధికారులను కోరారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఏఈ కృష్ణ వేణి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తాండ వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు వెంకటేష్, ముళగిరి శ్రీనివాస్, సంజీవ్, శంలేట్ నరసింహ రాజు, అనిల్, దుర్గారామ్, శేఖర్, ప్రభాకర్, నర్సింహా, ప్రకాష్, మన్నే రమేష్, రంగస్వామి, శ్రీకాంత్, నర్సింగ్ రావు, గోవర్ధన్, బస్తి వాసులు పాల్గొన్నారు.