నమస్తే శేరిలింగంపల్లి: యువజన ఉద్యమ నిర్మాత, ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి 35వ వర్ధంతిని మియాపూర్ స్టాలిన్ నగర్ ఎంసీపీఐయూ కార్యాలయంలో నిర్వహించారు. కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కామ్రేడ్ కన్నా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు మైదాంశెట్టి రమేష్ హాజరై మాట్లాడారు. కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి నిత్యం పేద ప్రజల పక్షాన ముందుండి యువజన ఉద్యమాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి యువజన సంఘాల నిర్మాణం చేశారన్నారు. ఎంసిపిఐయు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకొని బూర్జువా భూస్వామ్య పార్టీలకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కుల కొరకు నిరంతరం పరితపించిన యువజన ఉద్యమనేతగా పేరు పొందారని తెలిపారు. కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నక్సలైట్లు జూన్ ఒకటో తేదీ 1987 సంవత్సరంలో సిద్దయ్య హోటల్ లో టిఫిన్ చేస్తుండగా పిస్తోలు తో కాల్చిచంపారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం యువజన ఉద్యమాలను నిర్మాణం చేస్తూ ఈ దోపిడి సమాజాన్ని రూపు మాపాలని, నిజమైన పేదల రాజ్యం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు, ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సుకన్య, మురళి. దశరథ్ నాయక్,మధు సూదన్, రవి,లావణ్య గణేష్ నర్సింగ్, శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
