దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యమాలు చేసి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ సుజాత యాదవ్ జాతీయ జెండానుఆవిష్కరించారు.

శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారికి నివాళి ఆర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ అధ్యక్షులు, నాయకులు,  కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పిస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here