గోకుల్ ప్లాట్స్‌లో క‌రోనా నివార‌ణ క‌ర్య‌లు… సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణం పిచికారి చేసిన ప్రభుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనిలో డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ స్వ‌యంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంను పిచికారి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజారోగ్యం దృష్ట్యా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజ‌న్‌, ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో DRF సిబ్బంది ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని విరివిగా పిచికారి చేయిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతి కాలనీలో పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టాలని, పేరుకుపోయిన చెత్త చెదారంలను తొలగించాలని, ఎప్పటికప్పుడు కాలనీలను శుభ్రపరుస్తూ ఉండలని, పారిశుధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం లేకుండా చూడలని సంబంధిత అధికారులకు సూచించారు. కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలాని, వైరస్‌వ్యాప్తి చెందకుండా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏంఓహెచ్‌ డాక్టర్ కార్తిక్, ఎస్ఆర్‌పీ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్య‌క్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీను, బ్రిక్ శ్రీను, పితాని శ్రీను, అప్పారావు, సాంబయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్ఎఫ్ సిబ్బందితో క‌ల‌సి సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణం పిచికారి చేస్తున్న‌ ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here