గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస ప్ర‌భంజ‌నం ఖాయం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ఆదివారం డివిజ‌న్ ప‌రిధిలోని గోకుల్ ప్లాట్స్ చౌరస్తా, ప్రజయ్ మెగా పోలీస్, మహీంద్రా అశ్విత అపార్ట్ మెంట్స్ ప్రాంతాల్లో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌తో క‌లిసి ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

మాదాపూర్ డివిజ‌న్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్బంగా ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు అభివృద్ధిని చూసి ఓటు వేయాల‌న్నారు. మాదాపూర్ డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ను మ‌రోసారి కార్పొరేట‌ర్‌గా గెలిపించి సీటును సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు బ‌హుమ‌తిగా ఇవ్వాల‌న్నారు. తెరాస హ‌యాంలోనే మాదాపూర్ డివిజ‌న్ ఎంత‌గానో అభివృద్ధి చెందింద‌న్నారు. జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌ను గెలిపిస్తే డివిజ‌న్‌లో మ‌రింత అభివృద్ధి చేప‌డుతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌జ‌లు, తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here