నమస్తే శేరిలింగంపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేసుకోవాలని, థర్డ్ వేవ్ ఉధృతి మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలోనీ బస్తీ దవాఖాన లో పెప్సికో అండ్ సీడ్స్ (సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోలాజికల్ డెవలప్‌మెంట్ సొసైటీ), సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ వేశారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజర్ ఇందిరా భారతి, అపోలో హాస్పిటల్ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్ అర్చన దేవి, ఎగ్జిక్యూటివ్ ఎస్ సీ ఎం ప్రవీణ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనీషా, నర్సులు, ప్రమీల, డిబియా, శ్రీకాంత్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, మన్నే రమేష్, రంగస్వామి, మధు, దుర్గ రావు, కార్తీక్, నర్సింగ్ రావు, స్థానిక నేతలు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
