శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్‌లో రహదారుల నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు సంబంధించి చేసిన విజ్ఞప్తులకు జీహెచ్‌ఎంసీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావహుడు (బీఆర్‌ఎస్) ఎండీ అలావుద్దీన్ పటేల్ తెలిపారు.

కొండాపూర్‌లోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన ప్రయాణం, మెరుగైన రహదారి సౌకర్యాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు స్థానిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులకు స్పందించి పనులను వేగవంతం చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో చేపట్టే అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఇదే వేగాన్ని కొనసాగించాలని కోరారు. కొండాపూర్ ప్రజలు అందిస్తున్న నిరంతర మద్దతు, పౌర సమస్యలపై స్పందిస్తూ చేస్తున్న సూచనలు, విజ్ఞప్తులకు అలావుద్దీన్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు.





